ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

సట్లెజ్‌ జల విద్యుత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎస్‌జేవీఎన్‌) ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ (డిప్లొమా), టెక్నీషియన్‌ (ఐటీఐ) విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతోంది.

మొత్తం పోస్టులు: 100

వివరాలు:

  1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 40

  2. టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌లు: 25

  3. టెక్నీషియన్‌ (ఐటీఐ) అప్రెంటిస్‌లు: 35

అర్హత: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమా పోస్టులకు సంబంధిత విభాగంలో మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా, ఐటీఐ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు హిమాచల్‌ప్రదేశ్‌ నివాసులై ఉండాలి. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: డిగ్రీ అభ్యర్థులకు నెలకు రూ.15,000, డిప్లొమా అభ్యర్థులకు రూ.13,500, ఐటీఐ అభ్యర్థులకు రూ.12,500 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులు ప్రారంభం: 18-11-2026

దరఖాస్తులకు చివరి తేదీ: 17-12-2026

Website:https://www.sjvn.nic.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram