ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌), పైప్‌లైన్స్‌ డివిజన్‌లో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 500

వివరాలు:

  1. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌

  2. ట్రేడ్‌ అప్రెంటిస్‌

  3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌

  4. డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌

విభాగాలు: మెకానికల్‌, టెలికమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, అసిస్టెంట్‌-హ్యూమన్‌ రిసోర్స్‌ తదితర విభాగాలు...

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్‌/డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శిక్షణ వ్యవధి: 12 నెలలు.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 2026 నవంబరు 6.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 డిసెంబరు 5.

Website: https://www.iocl.com/apprenticeships

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram