ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు

ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు

చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి అప్రెంటిస్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 1,500

వివరాలు:

రాష్ట్రాల వారీగా ఖాళీలు:
ఆంధ్రప్రదేశ్: 85
తెలంగాణ: 46
తమిళనాడు : 270
ఉత్తరప్రదేశ్ : 285
పశ్చిమ బెంగాల్: 145
బిహార్: 80
మహారాష్ట్ర: 70
మధ్యప్రదేశ్ : 65
జార్ఖండ్: 60
కేరళ: 44
ఒడిశా: 42
రాజస్థాన్: 40
కర్ణాటక: 35
గుజరాత్: 35
హరియాణా: 32
దిల్లీ: 32
అస్సాం: 30
ఉత్తరాఖండ్: 20
ఇతర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు: 64

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 01-04-2022 నుంచి 01-11-2026 మధ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే ముందు ఎన్‌ఏటీ (NATS 2.0) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. గతంలో అప్రెంటిస్ శిక్షణ పొందినవారు లేదా విద్యార్హత పూర్తయ్యాక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు కారు.

వయోపరిమితి: 01-11-2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్‌: మెట్రో / పట్టణ ప్రాంతాలు- రూ.15000; గ్రామీణ/సెమీ అర్బన్‌ ప్రాంతాలు- రూ.12,300.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు ముందుగా NATS 2.0 వెబ్‌సైట్లో నమోదు చేసుకొని ఎన్‌రోల్‌మెంట్ ఐడీ పొందాలి. అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్‌లకు రూ.800+జీఎస్‌టీ; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175+జీఎస్‌టీ.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 05-11-2026

దరఖాస్తు చివరి తేదీ: 25.11.2026.

Website: https://indianbank.bank.in/en/career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram