యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026  

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026  

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ ప్రభుత్వ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది

మొత్తం పోస్టుల సంఖ్య: 1,358

వివరాలు:

1. మెడికల్ ఆఫీసర్స్‌ (జనరల్ డ్యూటీ/సెంట్రల్ హెల్త్‌ సర్వీస్‌): 864

2. అసిస్టెంట్ డివిజినల్‌ మెడికల్ ఆఫీసర్‌ (రైల్వే): 450

3. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌(న్యూ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌): 14

4. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌ (దిల్లీ): 30

విద్యార్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి ఎంబీబీఎస్ (ఎంబీబీఎస్‌) ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2026 నాటికి 32 ఏళ్లకు మించకూడదు (అభ్యర్థి ఆగస్టు 2, 1994 కంటే ముందు జన్మించి ఉండకూడదు). అయితే, సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లోని మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు పే మేట్రిక్స్‌ లెవల్-10 (రూ.56,100 - రూ. 1,77,500) ప్రకారం జీతభత్యాలు అందుతాయి. దీనితో పాటు నిబంధనల ప్రకారం నాన్-ప్రాక్టీసింగ్ అలవెన్స్ (NPA) కూడా లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది:

1. రాత పరీక్ష (Part-I): ఇది 500 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు (ఒక్కొక్కటి 250 మార్కులు) ఉంటాయి.

2. పర్సనాలిటీ టెస్ట్ (Part-II): రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి 100 మార్కులకు ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు.

దరఖాస్తు రుసుము: జనరల్‌ & ఓబీసీ అభ్యర్థులకు రూ.200 దరఖాస్తు రుసుము ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ & దివ్యాంగులకు రుసుము నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 11, 2026.

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31, 2026 (సాయంత్రం 6 గంటల వరకు).

పరీక్ష తేదీ: ఆగస్టు 2, 2026.

Website: https://upsconline.nic.in/exam-apply

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram