రాణి లక్ష్మీబాయి సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

రాణి లక్ష్మీబాయి సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఉన్న రాణి లక్ష్మీబాయి సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఆర్‌ఎల్బీసీఏయూ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టులు: 82

వివరాలు:

  1. కంట్రోలర్‌: 1

  2. ప్రొఫెసర్‌: 33

  3. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 27

  4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 21

విభాగాలు: అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌, యానిమల్‌ న్యూట్రిషన్‌, ఆక్వాకల్చర్‌, ఎంటమాలజీ, ఫిషరీస్‌, ఫారెస్ట్రీ, హార్టికల్చర్‌, వెటర్నరీ సైన్సెస్‌ తదితర విభాగాల్లో ఉన్నాయి

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

గరిష్ఠవయోపరిమితి: కంట్రోలర్‌, ప్రొఫెసర్‌కు 57 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 47 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 40 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన, అకడమిక్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. మహిళలకు, కంట్రోలర్‌ పోస్టుకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24-12-2026,

హార్డ్‌కాపీ పంపడానికి చివరి తేదీ: 31-12-2026.

Website: https://rlbcau.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram