హైదరాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ జిల్లా దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల సాధికారత శాఖ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌-4, క్లాస్‌-4 విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 83

వివరాలు:

  1. జూనియర్‌ అసిస్టెంట్‌ – 3

  2. లైబ్రేరియన్‌ గ్రేడ్‌-3 – 1

  3. ల్యాబ్‌ అటెండర్‌ – 1

  4. ఆఫీస్‌ సబార్డినేట్‌ – 16

  5. వాచ్‌మన్‌ – 8

  6. గేట్‌ పోర్టర్‌ – 4

  7. కమాటి – 8

  8. అసిస్టెంట్‌ ధోబీ – 4

  9. స్వీపర్‌ – 11

  10. స్కావెంజర్‌ – 2

  11. కుక్‌ – 1

  12. ఆయా – 1
    13 ఫిమేల్‌ వార్డ్‌ అటెండెంట్‌ – 1

  13. జూనియర్‌ లిఫ్ట్‌ అటెండర్‌ – 2
    తదితర పోస్టులు ....

అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, ఏడో తరగతి, ఐదో తరగతి లేదా చదవడం, రాయడం తెలిసి ఉండాలి. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన అభ్యర్థులు అర్హులు. వినికిడి లోపం ఉన్నవారికి 75 శాతం వైకల్యం తప్పనిసరి.

గరిష్ఠ వయోపరిమితి: 18-54 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, కంప్యూటర్‌ ప్రావీణ్యం, వయసు, వైకల్యం శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: అసిస్టెంట్‌ డైరెక్టర్‌, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల సాధికారత శాఖ, బ్లాక్‌ M4, మంజీరంజన్‌ కాంప్లెక్స్‌, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌, ఎం.జే. రోడ్‌, నాంపల్లి, హైదరాబాద్‌-500001.

దరఖాస్తులకు చివరి తేదీ: 27-12-2026,

Website: https://hyderabad.telangana.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram