ముంబయి పోర్ట్‌ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్‌ ఉద్యోగాలు

ముంబయి పోర్ట్‌ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్‌ ఉద్యోగాలు

ముంబయిలోని ముంబయి పోర్ట్‌ అథారిటీ (ఎంబీపీఏ), మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో ఫెసిలిటీ మేనేజర్‌ (యంగ్‌ ప్రొఫెషనల్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

  • ఫెసిలిటీ మేనేజర్‌ (యంగ్‌ ప్రొఫెషనల్స్‌) – 11

అర్హత: ఏదైనా విభాగంలో ప్రథమ శ్రేణితో బ్యాచిలర్‌ డిగ్రీ, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రథమ శ్రేణితో మాస్టర్స్‌ డిగ్రీ ఉండాలి. హాస్పిటాలిటీ సేవల్లో అనుభవం, మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ఇంగ్లిష్‌, హిందీ, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం ఉంటే ప్రాధాన్యం ఇస్తారు.

గరిష్ఠ వయోపరిమితి: 01-12-2026 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.50,000 వేతనం చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అవసరాన్ని బట్టి రాతపరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్, వైద్య విభాగం, ఎంబీపీఏ హాస్పిటల్, నాద్కర్ణి పార్క్, వడాలా (తూర్పు), ముంబయి – 400037.

దరఖాస్తులకు చివరి తేదీ: 14-12-2026.

Website: https://www.mumbaiport.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram