ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్‌ పోస్టులు

ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (ఏపీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌లలో మెంబర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనంతపురం, చిత్తూరు సహా 11 జిల్లాల్లో ఈ నియామకాలు చేపడుతోంది.

వివరాలు:

  • మెంబర్‌ పోస్టులు : 16

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు ప్రజా ప్రయోజన సేవల రంగంలో తగిన అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 నవంబరు 1 నాటికి 65 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఏపీ సచివాలయం సమీపంలో, మల్కాపురం గ్రామం, తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా-522238.

దరఖాస్తులకు చివరి తేదీ: 07-12-2026

Website: https://andhrapradesh.nalsa.gov.in/recruitments/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram