సౌత్ వెస్టర్న్ రైల్వేలో గ్రూప్‌-సి,డి పోస్టులు

సౌత్ వెస్టర్న్ రైల్వేలో గ్రూప్‌-సి,డి పోస్టులు

దక్షిణ పశ్చిమ రైల్వే.. రైల్ వీల్ ఫ్యాక్టరీ (యెలహంక) పరిధిలోని వివిధ విభాగాలలో స్కౌట్స్ అండ్‌ గైడ్స్ కింద 2026-27 సంవత్సరానికి గాను లెవల్-2, లెవల్-1 పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • గ్రూప్-సీ (లెవల్-2): 03 పోస్టులు
    ఎర్స్‌వైల్ గ్రూప్-డీ (లెవల్-1): 08 పోస్టులు

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్‌/ 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. లేదా ఐటీఐ (NCVT/SCVT) పూర్తి చేసి ఉండాలి. స్కౌట్స్ సంస్థలో క్రియాశీల సభ్యుడిగా ఉండి, జాతీయ/రైల్వే స్థాయిలలో రెండు, రాష్ట్ర స్థాయిలో రెండు ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.

వయోపరిమితి: 01.01.2027 నాటికి 18 నుంచి 33 ఏళ్ల వరకు ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్టిఫికెట్లలో ప్రతిభ, వైద్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

సాధారణ, ఇతరులకు: రూ. 500/- (రాత పరీక్షకు హాజరైన వారికి బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ. 400/- రిఫండ్ అవుతుంది). ఎస్టీ/ఎస్సీ/మాజీ సైనికులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి: రూ. 250/-

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 13.12.2026

Website: https://swr.indianrailways.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram