భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రెయినీ ఇంజినీర్-I ఉద్యోగాలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రెయినీ ఇంజినీర్-I ఉద్యోగాలు

రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవరత్న కంపెనీ.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌), కోట్‌ద్వార్ యూనిట్, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాజెక్ట్ ప్రదేశాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ట్రెయినీ ఇంజనీర్-I పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 23 పోస్టులు (ఎలక్ట్రానిక్స్: 16, మెకానికల్: 05, కంప్యూటర్ సైన్స్: 02)

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగాలలో (ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్) పాస్ క్లాస్‌తో రెగ్యులర్/ఫుల్ టైమ్ బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజినీరింగ్ (4 సంవత్సరాల కోర్సు) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: గరిష్ఠంగా అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అర్హత మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.

జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ (NCL) అభ్యర్థులకు: రూ. 177/- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 26.11.2026

Website: https://bel-india.in/job-notifications/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram