ఏపీ గ్రూప్-2 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ 2026

ఏపీ గ్రూప్-2 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ 2026

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 సర్వీసెస్ కింద వివిధ ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 720

వివరాలు:

మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: 06

డిప్యూటీ మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 176

కోఆపరేటివ్ సొసైటీల అసిస్టెంట్ రిజిస్ట్రార్: 10

డిప్యూటీ తహశీల్దార్: 203

సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II: 07

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్: 40

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 29

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జీఏడీ/ఫైనాన్స్/లా శాఖలు): మొత్తం 80

సీనియర్ అకౌంటెంట్ (హెచ్‌ఓడీలు/జిల్లాలు): మొత్తం 91

ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖలో జూనియర్ అకౌంటెంట్: 47

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 31

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా డిపార్ట్‌మెంట్‌)కు లా డిగ్రీ ఉండాలి. సీనియర్/జూనియర్ అకౌంటెంట్, ఏఎస్‌ఓ (ఫైనాన్స్) పోస్టులకు గణితం, అర్థశాస్త్రం లేదా వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ ఉండాలి. అకౌంటింగ్ పోస్టుల కోసం కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులు లేదా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత పోస్టులకు అవసరమైన శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.

వయోపరిమితి: 2026 జులై 1 నాటికి పోస్ట్ కోడ్‌ను బట్టి 18 నుంచి 44 సంవత్సరాలు లేదా 21 నుంచి 44 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ (CF) ఖాళీలకు దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

జీతం వివరాలు: మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: రూ.45,830 - 1,30,580, సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II, డిప్యూటీ తహశీల్దార్: రూ.44,570 - 1,27,480, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్: రూ.45,830 - 1,30,580, కోఆపరేటివ్ సొసైటీల అసిస్టెంట్ రిజిస్ట్రార్: రూ.45,830 - 1,30,580, డిప్యూటీ మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: రూ.45,830 - 1,30,580; సీనియర్ అకౌంటెంట్: రూ.34,580 - 1,07,210; జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌కు: రూ.25,220 - 80,910, ఇతర పోస్టులకు రూ.40,970 - రూ.1,24,380.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష - ఆఫ్‌లైన్ మోడ్/ఓఎంఆర్‌ ఆధారిత పరీక్ష 150 మార్కులు), మెయిన్ ఎగ్జామినేషన్, కొన్ని పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) ఉంటాయి. 300 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నిర్దేశించిన మార్కులలో 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.250, పరీక్ష ఫీజు రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన వైట్ కార్డ్ ఉన్న కుటుంబాలకు పరీక్ష ఫీజు రూ.80 నుంచి మినహాయింపు ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తారు. అభ్యర్థులు మూడు కేంద్రాలను ఎంచుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 10/11/2026

దరఖాస్తులకు చివరి తేదీ: 11.12.2026

స్కీనింగ్‌ పరీక్ష: 21.02.2027

Website:https://portal-psc.ap.gov.in/Default

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram