ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌)

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌)

భారత వైమానిక దళంలో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్‌ టెక్నికల్) విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌ 01/2027) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పర్మనెంట్ కమిషన్ (PC), షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) అవకాశాలు కల్పిస్తున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 284

వివరాలు:

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌) 01/ 2027:

ఫ్లయింగ్ (Flying): 36 పోస్టులు (షార్ట్ సర్వీస్ కమిషన్ - పురుషులు: 28, మహిళలు: 8)

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 124 పోస్టులు

  • ఏరోనాటికల్ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్ - AE(L): 88

  • ఏరోనాటికల్ ఇంజినీర్ మెకానికల్ - AE(M): 36
    గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 108 పోస్టులు

  • వెపన్ సిస్టమ్స్ (WS): పురుషులు 25, మహిళలు 5

  • అడ్మినిస్ట్రేషన్ (Adm): పురుషులు 35, మహిళలు 18

  • లాజిస్టిక్స్ (Lgs): పురుషులు 7, మహిళలు 4

  • అకౌంట్స్ (Accts): పురుషులు 4, మహిళలు 4

  • ఎడ్యుకేషన్ (Edn): పురుషులు 2, మహిళలు 2

  • మెటియోరాలజీ (Met): పురుషులు 1, మహిళలు 1

  • ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: ఫ్లయింగ్ బ్రాంచ్‌లో సీడీఎస్‌ఈ ఖాళీల నుంచి 10% (పీసీ కోసం), ఏఎఫ్‌క్యాట్‌ ఖాళీల నుంచి 10% (ఎస్‌ఎస్‌సీ కోసం) కేటాయించారు.
    GATE స్కోర్ ఎంట్రీ (గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్): 16
    AE(L): పురుషులు 07 మహిళలు 04
    AE(M): పురుషులు 3, మహిళలు 2

అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 10+2లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివి ఉండటంతోపాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం మూడేళ్ల డిగ్రీ లేదా నాలుగేళ్ల బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో నాలుగేళ్ల డిగ్రీ లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న తత్సమాన అర్హతలు ఉండాలి. నాన్‌ టెక్నికల్ పోస్టులకు బ్రాంచ్‌ను బట్టి డిగ్రీ, పీజీ, బీకామ్, ఫైనాన్స్ సంబంధిత డిగ్రీలు తదితర అర్హతలు అవసరం. గేట్‌ స్కోర్ ఎంట్రీకి సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు అర్హత కలిగిన గేట్‌ స్కోర్ ఉండాలి. పూర్తి విద్యార్హతలు బ్రాంచ్‌ను బట్టి మారుతాయి.

వయోపరిమితి: ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 01 జనవరి 2028 నాటికి 20- 24 ఏళ్ల మధ్య ఉండాలి. డీజీసీఏ ఇండియా జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ట వయోపరిమితి 26 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్)/గేట్‌ ఎంట్రీ: 20- 26 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: ఫ్లయింగ్ ఆఫీసర్‌కు రూ.56,100 - రూ.1,77,500.

ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ మూడు ప్రధాన దశల్లో ఉంటుంది. మొదటగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ రాత పరీక్ష (AFCAT) నిర్వహిస్తారు (దీనిలో ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు, తప్పు సమాధానానికి -1 నెగెటివ్ మార్కు ఉంటుంది). మొత్తం 100 ప్రశ్నలుంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను (లేదా ఎన్‌సీసీ/గేట్‌ ద్వారా నేరుగా ఎంపికైన వారిని) ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ (AFSB) పరీక్షలకు పిలుస్తారు. అక్కడ స్టేజ్-I (ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్ రేటింగ్ & పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్ అండ్ డిస్కషన్ టెస్ట్ నిర్వహిస్తారు.), స్టేజ్-II (సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్క్‌లు, ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ పరీక్ష ఉంటుంది. చివరగా వైద్య పరీక్షలు, మెరిట్ జాబితా ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ అభ్యర్థులకు రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. అర్హులైన వారికి నేరుగా ఏఎఫ్‌ఎస్‌బీ పరీక్ష నిర్వహిస్తారు

దరఖాస్తు ఫీజు: రూ.550+జీఎస్‌టీ. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ & గేట్‌ స్కోర్ ఎంట్రీ అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష రుసుము లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభం: 12.11.2026

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.12.2026

ఏఎఫ్‌క్యాట్‌ పరీక్ష: 31.01.2027

కోర్సు ప్రారంభం: జనవరి 2028

Website:https://indianairforce.nic.in/index#joi

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram