దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డులో పోస్టులు

దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డులో పోస్టులు

దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) 2026 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 1,260

వివరాలు:

  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 1,075 (ఎంటీఎస్‌ జనరల్‌ డ్యూటీ-835, ఎంటీఎస్‌- ఆయా(మహిళలు) 239)

  • జూనియర్‌ ఇంజినీర్: 185

విభాగాలు/శాఖలు: విద్యాశాఖ, ట్రేడ్‌ అండ్‌ ట్యాక్సెస్‌, దిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు, ఉన్నత విద్యాశాఖ, వెయిట్స్ అండ్ మెజర్స్ శాఖ, ప్రిన్సిపల్ అకౌంట్స్ కార్యాలయం, ల్యాండ్ అండ్ బిల్డింగ్ శాఖ, న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డు, ట్రాన్స్‌కో లిమిటెడ్, ర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు తదితరాలు.

అర్హత: జూనియర్ ఇంజినీర్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. కొన్ని శాఖల్లో డిప్లొమాతో పాటు రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. ఎంటీఎస్‌ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. దిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు పోస్టుకు పదో తరగతి లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ అర్హత ఉండాలి. పోస్టును బట్టి అర్హతలు, అనుభవం మారుతాయి.

వయోపరిమితి: 18- 27 సంవత్సరాలు (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది.

జీతం: నెలకు జూనియర్ ఇంజినీర్‌కు రూ.35,400- రూ.1,12,400; ఎంటీఎస్‌కు రూ.18,000- రూ.56,900.

ఎంపిక విధానం: జూనియర్ ఇంజినీర్‌కు రెండు దశల్లో (Tier-I, Tier-II) పరీక్ష ఉంటుంది. టైర్‌-1లో 200 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. టైర్‌-IIలో 150 ప్రశ్నలు, 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఎంటీఎస్‌ పోస్టులకు ఒకే దశలో (One Tier) కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. 200 ప్రశ్నలు, 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు

పరీక్ష విధానం: జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అరిథ్‌మెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ, ఇంగ్లిష్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. జూనియర్ ఇంజినీర్ పరీక్షలో సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఎంపిక పరీక్షలో సాధించిన మార్కులు, మెరిట్ ఆధారంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి స్కిల్/ఎండ్యూరెన్స్/ట్రేడ్ టెస్ట్ నిర్వహించవచ్చు.

దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్సీ/ఎస్టీ/మహిళలు, దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులు ప్రారంభం: 12.11.2026

దరఖాస్తు చివరి తేదీ: 11.12.2026.

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

Website: https://dsssb.delhi.gov.in/dsssb-vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram