రైట్స్‌ లిమిటెడ్‌లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

రైట్స్‌ లిమిటెడ్‌లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ అయిన రైట్స్‌ లిమిటెడ్, దక్షిణ ప్రాంతం (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి) కోసం కాంట్రాక్ట్ లంప్సమ్ ప్రాతిపదికన నిపుణుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్- 31

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో ఫుల్ టైమ్ డిప్లొమా కలిగి ఉండాలి, సంబంధిత ఇంజినీరింగ్ రంగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రారంభ వేతనం రూ.20,644 నుంచి రూ.26,624 వరకు ఉంటుంది.

వయోపరిమితి: 40 ఏళ్ల వరకు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ / ఓబీసీ అభ్యర్థులు: రూ. 300/- + వర్తించే పన్నులు ఈడబ్ల్యూఎస్‌/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు: రూ. 100/- + వర్తించే పన్నులు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 22.11.2026

Website: https://rites.com/career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram