ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ దిల్లీలో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు 

ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ దిల్లీలో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు 

న్యూదిల్లీలోని నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ)దిల్లీ, ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తును కోరుతోంది. 

మొత్తం పోస్టులు - 09

వివరాలు: 

1.యంగ్ ప్రొఫెషనల్ (సీఏ/సీఎంఏ) -04

2. యంగ్ ప్రొఫెషనల్ (లీగల్) - 04

3. యంగ్ ప్రొఫెషనల్ (ఐటీ) - వెబ్ డిజైనర్ - 01

అర్హత: పోస్టులను అనుసరించి సీఏ/సీఎంఏ సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ/ఎంసీఏ/ఎంసీఏ/బీఏ/ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతో పాటు ఏడాది నుంచి రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.70,000 వరకు ఉంటుంది.

గరిష్ఠవయోపరిమితి: చివరి తేదీ నాటికి అభ్యర్థులు 32 ఏళ్లకు మించకూడదు. 

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ లేదా ఈమెయిల్ manager-admn@nfra.gov.in లేదా పోస్టు ద్వారా పంపాలి.

చిరునామ: జాతీయ ఆర్థిక నివేదికల ప్రాధికార సంస్థ, 7వ అంతస్తు, హెచ్‌టి హౌస్, 18-20. కెజి మార్గ్, దిల్లీ.

దరఖాస్తు చివరి తేది: 05.07.2026.

Website: https://nfra.gov.in/direct-recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram