భారత వైమానిక దళంలో గ్రూప్ 'సి' సివిలియన్ పోస్టులు

భారత వైమానిక దళంలో గ్రూప్ 'సి' సివిలియన్ పోస్టులు

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో గ్రూప్ 'సి' సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 47

వివరాలు: 

లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, హిందీ టైపిస్ట్‌, సివిలియన్‌ మెకానికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్‌- ఆర్డినరీ గ్రేడ్‌(సీఎంటీడీ)

యూనిట్‌ల వారీగా ఖాళీలు:
హెచ్‌క్వార్టర్‌ మెయింటనెన్స్‌ కమాండ్‌, ఐఏఎఫ్‌: 14

హెచ్‌క్వార్టర్‌ ట్రైనింగ్‌ కమాండ్‌, ఐఏఎఫ్‌: 05

హెచ్‌క్వార్టర్‌ సెంట్రల్‌ ఎయిర్‌ కమాండ్‌, ఐఏఎఫ్‌: 03

హెచ్‌క్వార్టర్‌ వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌, ఐఏఎఫ్‌: 06

హెచ్‌క్వార్టర్‌ ఈస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌, ఐఏఎఫ్‌: 06

హెచ్‌క్వార్టర్‌ సౌత్‌ వెస్ట్రన్‌ కమాండ్‌, ఐఏఎఫ్‌: 05

హెచ్‌క్వార్టర్‌ సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌, ఐఏఎఫ్‌: 01

ఇండిపెండెంట్‌ యూనిట్స్‌, ఐఏఎఫ్‌: 07

అర్హతలు: ఎల్‌డీసీ, హిందీ టైపిస్ట్‌కు గుర్తింపు పొందిన బోర్డు నుంచి  ఇంటర్మీడియట్‌ ఉత్తర్ణతతో పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లిష్‌, హిందీ టైపింగ్‌ వేగం కలిగి ఉండాలి. 
డ్రైవర్ (CMTD): మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణతతో పాటు, లైట్, హెవీ వెహికల్స్ నడపడానికి చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన, కనీసం రెండేళ్ల డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ప్రాక్టికల్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 1.06.2026.

Website:https://indianairforce.nic.in/iaf_career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram