రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ బోధనాసుపత్రిలో కింది పోస్టుల భర్తీకి ఉమ్మడి నోటిఫికేషన్ విడుదలైంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 39

వివరాలు:

1. ప్రభుత్వ మెడికల్ కాలేజీ(జీఎంసీ): 04

2. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి(జీటీజీహెచ్‌): 35

కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, ఎలక్ట్రికల్ హెల్పర్, మోర్చ్యురీ అటెండెంట్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ & ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఎస్‌డబ్ల్యూ, బీటెక్‌, బీఈ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి 42 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. గరిష్ఠంగా అన్ని సడలింపులతో కలిపి 52 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు పోస్టులను బట్టి రూ.15,000 నుంచి రూ.54,060.

దరఖాస్తు విధానం:  అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తులను https://eastgodavari.ap.gov.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కార్యాలయంలోని కౌంటర్లలో నేరుగా అందజేయాలి. పోస్టు ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించబడవు.

ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.300, ఇతరులకు రూ.200. డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో చెల్లించాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు గాను ఎంపిక ఉంటుంది. ఇందులో 75 శాతం మార్కులు విద్యార్హత పరీక్షలకు, గరిష్ఠంగా 15 శాతం మార్కులు కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ సర్వీస్ వెయిటేజీకి, & 10 శాతం మార్కులు ఉత్తీర్ణత సాధించినప్పటి నుంచి గడిచిన కాలానికి కేటాయిస్తారు.

దరఖాస్తు ప్రారంభం: 2026 ఏప్రిల్ 15.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 29.

Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram