ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఆపరేటర్ ట్రైనీ పోస్టులు

ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఆపరేటర్ ట్రైనీ పోస్టులు

భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్‌సీఎఫ్‌) లిమిటెడ్  మహారాష్ట్రలోని థాల్,  ట్రాంబే యూనిట్లలో ఆపరేటర్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.  

వివరాలు:

ఆపరేటర్ (కెమికల్‌) ట్రైనీ : 188 పోస్టులు

అర్హత: అభ్యర్థులు ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణతో పాటు గ్రాడ్యుయేషన్ తర్వాత ఎన్‌సీవీటీ ద్వారా ఇచ్చే ఏఓసీపీ (Attendant Operator Chemical Plant) ట్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. లేదా కెమికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసి ఏడాది బీఓఏటీ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు కనీసం 55%, SC/ST అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి..

వయోపరిమితి: 01.02.2026 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు 33 ఏళ్లు; ఎస్సీ/ఎస్టీలకు 35 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ట్రైనీ శిక్షణ కాలంలో రూ.22,000. తరువాత రూ.47,800.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులకు రూ.700; ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్‌సర్విస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 24.04.2026.

Website:https://rcfltd.com/hrrecruitment/recruitment-1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram