శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ ఆయా పోస్టులు

శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ ఆయా పోస్టులు

శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర రెవిన్యూ డివిజన్ పరిధిలో గల ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో అంగన్వాడీ సహాయకుల (ఆయాల) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.  

వివరాలు:

అంగన్వాడీ సహాయకులు: 55 

అర్హత: అభ్యర్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.కేవలం వివాహిత మహిళలు మాత్రమే అర్హులు.అభ్యర్థి అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం/మజరాకు చెందిన స్థానికురాలై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 01-07-2026 నాటికి అభ్యర్థి వయస్సు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.

గౌరవ వేతనం: అంగన్వాడీ సహాయకులకు నెలకు రూ.7,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: జిల్లా మహిళాభివృద్ధి,  శిశు సంక్షేమ శాఖ, కార్యాలయం శ్రీ సత్యసాయి జిల్లా. 

దరఖాస్తు చివరి తేదీ: 16-04-2026. 

Website:https://srisathyasai.ap.gov.in/notice_category/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram