ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు

ఈఐఎల్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అనుభవం కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. సివిల్, మెకానికల్, వెల్డింగ్/ఎన్‌డీటీ, ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్-III & గ్రేడ్-IV పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

వివరాలు:

అసోసియేట్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-3, 4: 29

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ(ఇంజినీరింగ్‌), బీటెక్‌/బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31.03.2026 నాటికి గ్రేడ్-III కి 41 ఏళ్లు, గ్రేడ్-IV కి 45 ఏళ్లు మించకూడదు (నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).

వేతనం: నెలకు రూ.1,12,000.

దరఖాస్తు & ఇంటర్వ్యూ వివరాలు:

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 19, 2026 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 27, 28, 29 & 30 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి.

వేదిక: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, సెక్టార్-16, గురుగ్రామ్, హరియాణ.

Website:https://recruitment.eil.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram