నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో పారామెడికల్‌, ఓవర్సీర్‌, టెక్నీషియన్‌ ఉద్యోగాలు

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో పారామెడికల్‌, ఓవర్సీర్‌, టెక్నీషియన్‌ ఉద్యోగాలు

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీ, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం సోన్‌భద్రలోని కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో పారామెడికల్‌ అండ్‌ ఓవర్సీర్‌, హెచ్‌ఈఎంఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 577

వివరాలు:

1. హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ): 472 పోస్టులు (డంపర్, డోజర్, గ్రేడర్ క్రేన్‌, పేలోడర్‌, సర్ఫేస్‌ మైనర్‌).

2. పారామెడికల్ స్టాఫ్: 75 పోస్టులు (స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్ట్‌).

3. ఓవర్సీర్ (సివిల్): 30 పోస్టులు.

అర్హతలు: హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్‌కు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే హెచ్‌ఎంవీ (Heavy Motor Vehicle) డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
పారామెడికల్‌కు పోస్టును బట్టి 10+2/ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ (నర్సింగ్, ఫార్మసీ, పాథాలజీ మొదలైనవి) కలిగి ఉండాలి. ఓవర్సీర్‌కు సివిల్ ఇంజినీరింగ్‌లో 3 ఏళ్ల డిప్లొమా ఉండాలి

వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ) పోస్టులకు రోజుకు రూ.1,502; పారామెడికల్ & ఓవర్సీర్ (గ్రేడ్ C) పోస్టులకు నెలకు రూ.47,330; ఇతర టెక్నీషియన్లు (గ్రేడ్ D) పోస్టులకు నెలకు రూ.43,775 + ఇతర అలవెన్సులు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180; ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 09.04.2026.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 01.05.2026.

Website: https://www.nclcil.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram