ప్రముఖ సాహితీవేత్త, రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య ఎస్‌ఎల్ భైరప్ప (94) 2025, సెప్టెంబరు 24న బెంగళూరులో మరణించారు. ఆయన సరస్వతి సమ్మాన్, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారంతోపాటు అనేక సత్కారాలు అందుకున్నారు. మహాభారతాన్ని నేపథ్యంగా తీసుకుని ఆయన రచించిన ‘పర్వ’ గ్రంథం హిందీ, మరాఠి, ఆంగ్లం, తెలుగు, బెంగాలీ, తమిళ భాషల్లోకి అనువాదమైంది.