ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో మోదీ భేటీ

ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో మోదీ భేటీ

ఫ్రాన్స్‌ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోదీ 2026, జూన్‌ 14న ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్‌-ఫ్రాన్స్‌ నిర్ణయించుకున్నాయి. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేసుకుని రూ. 3 లక్షల కోట్లకు చేర్చాలని అంగీకారానికి వచ్చాయి. నవకల్పనల రంగానికి ఒక మార్గసూచీని నిర్ణయించారు. సంక్లిష్ట రంగాల్లో సంబంధాల విస్తృతికి సంయుక్తంగా ఏఐ ఆధారిత వ్యవస్థను తీర్చిదిద్దాలని ఇరువురు నేతలూ అంగీకారానికి వచ్చారు. ఇరువురి సమక్షంలో మొత్తం 13 ఒప్పందాలు ఖరారయ్యాయి. హైస్పీడ్‌ రైల్వేకు సహకారం, రహస్య సమాచారంపై భద్రతా ఒప్పందం, పారిస్‌.. నీస్‌ విమానాశ్రయాలకూ యూపీఐ చెల్లింపుల వ్యవస్థ విస్తరణ వంటివి ఒప్పందాల జాబితాలో ఉన్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram