మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ). ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈలు అందించే ప్రోత్సాహాన్ని గుర్తించే లక్ష్యంతో ఏటా జూన్ 27న ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం’గా (Micro, Small and Medium-sized Enterprises - MSME Day) నిర్వహిస్తారు. అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో, నూతన ఆవిష్కరణలు - సృజనాత్మకతను ప్రోత్సహించడంలో, ఉద్యోగాల సృష్టిలో ఎంఎస్‌ఎంఈల పాత్రను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అనేవి తయారీ లేదా సేవల రంగంలో కార్యకలాపాలు సాగించే వ్యాపార సంస్థలు. భారత ప్రభుత్వం 2006, అక్టోబరు 2న నోటిఫై చేసిన ‘సూక్ష్య, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం (Micro, Small and Medium Enterprises Development - MSMED) Act), 2006’ ఎంఎస్‌ఎంఈల నిర్వచనానికి సంబంధించిన అంశాలను తెలుపుతుంది. చిన్న వ్యాపారాలు ఒక క్రమబద్ధమైన, స్థిరమైన పద్ధతిలో వృద్ధి చెందడానికి వీలుగా, వాటికి లక్షిత విధాన మద్దతు, నియంత్రణ, ప్రోత్సాహకాలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.
స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ‘బిగ్గర్ ది బెస్ట్’ అనే భావనతో మొదటి
పారిశ్రామిక తీర్మానం (1948) నుంచే భారీ మౌలిక పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. 1977లో జనతా ప్రభుత్వం ‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’ భావనతో గ్రామీణ, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక తీర్మానం (1977) ప్రకటించింది. చిన్నతరహా పరిశ్రమల రంగాన్ని 2006 వరకు ఎస్‌ఎస్‌ఐ (స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్) అని వ్యవహరించారు.
ఎంఎస్‌ఎంఈ లక్ష్యాలు
పరిమిత మూలధనంతో చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, అభివృద్ధి చేయడానికి వ్యక్తులకు అనుమతి ఇవ్వడం ద్వారా వ్యవస్థాపకత, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం; భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించడం; గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడి ఖర్చుతో పారిశ్రామికాభివృద్ధిని విస్తరించడం ద్వారా సమ్మిళిత, సమతౌల్య ప్రాంతీయ అభివృద్ధిని నిర్ధారించడం మొదలైనవి.
చారిత్రక నేపథ్యం
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఎంఎస్‌ఎంఈలు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి (ఐరాస) భావించింది. అందుకే 2017, ఏప్రిల్ 6న జరిగిన ఐరాస 74వ సమావేశంలో జూన్ 27న ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం’గా నిర్వహించాలని తీర్మానించింది.
2026 నినాదం: Empowering MSMEs through Innovation and Sustainable Industrial Development
|
భారతదేశంలో ఎంఎస్‌ఎంఈలు, ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు/ పథకాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ తదితర సమాచారంతోపాటు గతంలో యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రెటరీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్, ఆర్‌ఆర్‌బీ క్లర్క్ మెయిన్స్ తదితర పోటీ పరీక్షల్లో అడిగిన 140కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. 2024, సెప్టెంబరు నాటికి కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2025)
1) మనోహర్ లాల్ 2) జితన్ రామ్ మాంఝీ
3) ధర్మేంద్ర ప్రధాన్ 4) పీయూష్ గోయల్
సమాధానం: 2
2. భారతదేశ ఎంఎస్‌ఎంఈ శాఖ సహాయ మంత్రి ఎవరు (2025 డిసెంబరు నాటికి)?
(ఎంపీ పోలీస్ ఎస్‌ఐ, 2026)
1) స్మృతి ఇరానీ 2) నిర్మలా సీతారామన్
3) సుశ్రీ శోభా కరంద్లాజే 4) అనుప్రియా పటేల్
సమాధానం: 3
3. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ గణితం, 2018), (ఆర్‌బీఐ గ్రేడ్ బి, 2018),
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2025)
1) జూన్ 24 2) జూన్ 25 3) జూన్ 26 4) జూన్ 27
సమాధానం: 4
4. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని కింది ఏ సంవత్సరంలో ఆమోదించారు?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2019)
1) 2004 2) 2002 3) 2008 4) 2006
సమాధానం: 4
5. What is the primary objective of the Micro, Small, and Medium Enterprises Development (MSMED) Act of 2006 in India?
(SSC CGL, 2024)
1) To regulate foreign companies
2) To focus on large-scale industries only
3) To increase import tariffs to protect MSMEs
4) To promote and facilitate the development of MSMEs
Ans:4
6. What is the full form of MEDP?
(SSC CHSL Exam, 2023)
1) Micro Enterprise Development Programme
2) Medium Enterprise Development Programme
3) Microfinance Entity Development Programme
4) Micro Enterprise District Project
Ans:1
7. Which of the following categories of MSMEs constitutes the major share of MSME registration on the Udyam Registration Portal?
(RRB NTPC Graduate, 2025)
1) Large 2) Micro 3) Small 4) Medium
Ans: 2
8. The Reserve Bank of India had set up an expert committee to review the current framework for the Micro, Small & Medium Enterprises (MSME sector). Who among the following was the head of the committee?
(RRB Office Assistant, 2019)
1) Shaktikanta Das 2) UK Sinha 3) Sudha Balakrishnan
4) Urjit Patel 5) Mahesh Kumar Jain
Ans: 2