అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం

యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. నొప్పులను నివారించడం, రక్తపోటును అదుపులో ఉంచడం, నిద్రలేమి సమస్యలను అధిగమించడం లాంటివెన్నో యోగాతో సాధ్యం. యోగా వల్ల ప్రజలకు కలిగే ఉపయోగాలను తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్‌ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా (International Day of Yoga) నిర్వహిస్తారు. దీన్ని సాధన చేయడం వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలను ప్రజలకు చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

యోగా అంటే?

  • యోగా అనేది సంస్కృత భాషా పదమైన యుజ్‌(Yuj) నుంచి వచ్చింది. దీని అర్థం చేరడం లేదా ఏకం చేయడం. ఇది ఆధ్యాత్మిక, శారీరక, మానసిక క్రమశిక్షణలను కలిగిఉన్న ఒక సంపూర్ణ సాధన. యోగా శారీరక వ్యాయామాలు, ‘ఆసనాలు’గా పిలిచే భంగిమలు, ధ్యానం - శ్వాస వ్యాయామాల సమగ్ర సమ్మేళనంగా ఉంటుంది.
  • భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు సంప్రదాయ శాఖల్లో యోగా ఒకటి.
  • మిగిలినవి: న్యాయ, వైశ్లేషిక, సంఖ్య, మీమాంస, వేదాంత.
  • సింధులోయ నాగరికత (క్రీ.పూ.3300 నుంచి క్రీ.శ.1300) ‘అమరమైన సాంస్కృతిక వారసత్వం (immortal cultural outcome) గా యోగాను పరిగణిస్తారు. క్రీ.పూ. 7వ శతాబ్దంలో యజ్ఞవల్క్య రచించిన బృహదారణ్యక ఉపనిషత్తులో యోగా గురించి ఉంది. క్రీ.పూ.8వ శతాబ్దం నాటి కఠోపనిషత్తులోనూ దీని ప్రస్తావన ఉంది. క్రీ.పూ. 500 నుంచి క్రీ.శ.800 మధ్య కాలాన్ని శాస్త్రీయ కాలంగా పేర్కొంటారు. పతంజలి మహర్షి యోగాను మొదటిసారిగా క్రమబద్ధంగా వివరించారు.
  • పతంజలి యోగాను ‘చిత్తవృత్తి నిరోధః’ అని నిర్వచించారు. దీని అర్థం ‘మనసులోని అలజడులను లేదా ఆలోచనలను నిలిపివేయడం’. జ్ఞానోదయ మార్గానికి ఆటంకం కలిగించే అయిదు క్లేశాలను (దుఃఖానికి కారణాలు) పతంజలి పేర్కొన్నారు. అవి: అవిద్య (అజ్ఞానం), ఆస్మిత (అహంకారం), రాగం (ఆసక్తి), ద్వేషం (అనాసక్తి), అభినవేశం (మరణ భయం). ఈయన 1800 రకాల యోగా నియమాలను 196 యోగసూత్రాలుగా గ్రంథస్థం చేశారు. 

చారిత్రక నేపథ్యం

  • యోగాని విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014, సెప్టెంబరు 27న ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్‌ అసెంబ్లీ 69వ సెషన్‌ ప్రారంభోత్సవంలో ఏటా జూన్‌ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా జరపాలని ప్రతిపాదించారు. డిసెంబరు 11న ఈ తీర్మానానికి 177 సభ్య దేశాల ఆమోదం లభించింది. ఆ విధంగా 2015 నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజును నిర్వహిస్తున్నారు.
యోగాలో రకాలు, ప్రాముఖ్యత, యోగాకి సంబంధించిన ముఖ్యాంశాలు, ప్రధాన మంత్రి యోగా అవార్డులు లాంటి సమాచారంతోపాటు ఏపీ పోలీస్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ, ఎన్‌డీఏ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 90కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
(టీఎన్‌పీఎస్సీ గ్రూప్‌ 2, 2015), (ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2018), (ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్, 2023), (యూపీ టీజీటీ ఫిజిక్స్, 2019), (ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీటీ, 2021)

1) జూన్‌ 20           2) జూన్‌ 21        3) జూన్‌ 22      4) జూన్‌ 23

సమాధానం: 2

2. UNO proclaimed International Yoga Day through the Resolutions 69/131 in the year
(UGC NET 2022)

1) 2015        2) 2014        3) 2016        4) 2017

Ans: 2

3. What was the theme of the International Day of Yoga 2024, which was celebrated in Rajasthan also?
(RPSC Assistant Professor 2024)

1) Yoga for Vasudhaiva Kutumbakam

2) Yoga for Self and Society

3) Yoga for Humanity

4) Yoga for Wellness

Ans: 2

4. Which of the following events was conducted by the Ministry of Ayush, GoI to mark the 100-day countdown to the International Day of Yoga 2022?
(SSC CGL 2022)

1) Yoga Mahotsav        2) Yoga Utsav    3) Yoga Sutra    4) Yoga Umang

Ans: 1

5. What is the significance of the International Yoga Day celebrated on 21st June?
(CUET PG 2025)

1) to promote Yoga globally

2) to mark the launch of new Yoga equipments only

3) to conduct competitive Yoga events only

4) to honor Yoga instructors only

Ans: 1

6. International Day of Yoga coincides with -
(APPSC Forest beat officer Mains 2019)

1) Winter Solstice            2) Spring Equinox

3) Summer Solstice            4) Autumn Equinox

Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram