వరల్డ్‌ సికిల్‌ సెల్‌ డే

వరల్డ్‌ సికిల్‌ సెల్‌ డే

సికిల్‌ సెల్‌ రుగ్మత ఉన్న వ్యక్తుల్లో కణాలకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు. క్రమంగా తీవ్ర నొప్పి, రక్తహీనత, రోగ నిరోధక శక్తి తగ్గడం లాంటి సమస్యలు మొదలవుతాయి. అలాగే కొనసాగితే ప్రాణాలకూ ముప్పు ఏర్పడవచ్చు. సికిల్‌ సెల్‌ రుగ్మత గురించి ప్రజల్లో చైతన్యం కల్పించే లక్ష్యంతో ఏటా జూన్‌ 19న ‘వరల్డ్‌ సికిల్‌ సెల్‌ డే’గా నిర్వహిస్తారు. ఈ వ్యాధి బారిన పడిన రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

సికిల్‌ సెల్‌కు మూలం

  • ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్‌లో ‘బీటా గ్లోబిన్‌’ అనే ప్రోటీన్‌ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది హెచ్‌బీబీ అనే జన్యువు కారణంగా తయారవుతుంది. జన్యువులో మార్పులు తలెత్తితే హిమోగ్లోబిన్‌ ఆకారమూ దెబ్బతింటుంది. సికిల్‌ సెల్‌ జబ్బుకు ఇదే మూలం. తల్లిదండ్రుల్లో ఒకరికి సికిల్‌ సెల్‌ జన్యువు ఉంటే ఇబ్బంది ఉండదు. ఇద్దరి నుంచి ఇలాంటి జన్యువు సంక్రమిస్తేనే సమస్య ఉత్పన్నమవుతుంది.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80లక్షల మంది ఈ సికిల్‌ సెల్‌ వ్యాధి బారిన పడ్డారు. ఏటా 3 లక్షల కంటే ఎక్కువమంది శిశువులు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 80% సబ్‌ సహారా ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నాయి. ఇది గణనీయంగా శిశుమరణాలకు కారణమవుతోంది. అయిదేళ్లలోపు పిల్లల్లో ఏటా సుమారు 81,100 మంది దీని కారణంగా చనిపోతున్నారు.
  • మన దేశంలో గిరిజనులను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న 10 ప్రధాన ఆరోగ్య సమస్యల్లో సికిల్‌ సెల్‌ ఎనీమియా ఒకటిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించింది. 2026 నాటికి మన దేశంలో మొత్తం 18.85 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, మన దేశ జనాభాలో 8.6% (సుమారు 6.75 కోట్ల మంది) షెడ్యూల్డ్‌ తెగలకు చెందినవారు ఉన్నారు. వీరిలో ఈ వ్యాధి తీవ్రస్థాయిలో కనిపిస్తుంది.

చారిత్రక నేపథ్యం

  • 2008, డిసెంబరు 22న ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సికిల్‌ సెల్‌ను ప్రపంచంలోని ప్రధాన జన్యు వ్యాధుల్లో ఒకటిగా గుర్తించింది. అంతేకాక ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా జూన్‌ 19న ‘వరల్డ్‌ సికిల్‌ సెల్‌ డే’గా నిర్వహించాలని తీర్మానించింది. 2009 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
సికిల్‌ సెల్‌ రకాలు, నివారణ - చికిత్స, సమస్యలు - లక్షణాలు, భారత ప్రభుత్వ కార్యక్రమాల వివరాలతోపాటు గతంలో యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ, ఎస్‌ఎస్‌సీ లాంటి పరీక్షల్లో అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. సికిల్‌ సెల్‌ అనీమియా కింది దేనివల్ల సంభవిస్తుంది?
(యూపీఎస్‌ఎస్‌ఎస్‌సీ చక్‌బందీ లేఖ్‌పాల్, 2019)

1) ఫోలిక్‌ ఆమ్లం లోపం    2) హిమోగ్లోబిన్‌ అసాధారణ స్థాయి

3) ఐరన్‌ లోపం         4) ఎర్రరక్త కణాల ఉత్పత్తి తగ్గడం

సమాధానం: 2

2. కింది దేనిలో కలిగే ఉత్పరివర్తన (మ్యూటేషన్‌) కారణంగా సికిల్‌ సెల్‌ వ్యాధి వస్తుంది?(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ ప్రహారీ కంబైన్డ్‌ ఎగ్జామ్, 2023)

ఎ) హిమోగ్లోబిన్‌ - బీటా

బి) టైటిన్‌

సి) హిమోగ్లోబిన్‌ - ఆల్ఫా

1) ఎ మాత్రమే     2) బి మాత్రమే

3) సి మాత్రమే     4) ఎ, బి

సమాధానం: 1

3. ‘వరల్డ్‌ సికిల్‌ సెల్‌ డే’ను ఎప్పుడు నిర్వహిస్తారు?
(ఎన్‌వీఎస్‌ ల్యాబ్‌ అటెండెంట్, 2022)

1) జూన్‌ 16   2) జూన్‌ 17         3) జూన్‌ 18           4) జూన్‌ 19

సమాధానం: 4

4. సికిల్‌ సెల్‌ అనీమియా దేనివల్ల వస్తుంది?

(యూపీపీఎస్సీ జీఐసీ లెక్చరర్‌ (జువాలజీ), 2017)

1) హార్మోన్లు     2) వైరస్‌లు        3) బ్యాక్టీరియా     4) జన్యుపరివర్తనం

సమాధానం: 4

5. National Sickle Cell Anaemia Elimination Programme, introduced in the Union Budget 2023, aims to eliminate sickle cell genetic transmission by the year ____________.
(SSC MTS, 2024)

1) 2049        2. 2045        3. 2040        4. 2047    

Ans: 4

6. A mutation changes one amino acid in hemoglobin, causing sickle cell anemia.
This mainly affects:
(UPPSC Civil Services (Prelims), 2015)

1) Primary structure            2) Secondary structure

3) Tertiary structure only        4) Quaternary structure only

Ans: 1

7. In which of the following Mendelian disorder substitution of Glutamic acid (Glu) takes place by Valine (Val)?
(SSC CHSL, 2024)

1) Phenylketonuria        2) Haemophilia      3) Sickle cell anemia      4) Turner's syndrome

Ans: 3 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram