ఎడారీకరణ, భూ క్షీణత, కరవు పరిస్థితుల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూన్ 17న ‘ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవం’గా (World Day to Combat Desertification and Drought) నిర్వహిస్తారు. ఎడారీకరణను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలు, నేల సారాన్ని పెంచే ప్రయత్నాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
ఎడారీకరణ - కరవు
ప్రస్తుతం భూగోళం ఎడారీకరణ, కరవు లాంటి రెండు రకాల ముప్పులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు సారవంతంగా ఉన్న భూమి క్రమంగా తన వృక్షసంపదను, వన్యప్రాణులను, సారాన్ని కోల్పోయి నిర్జీవంగా మారే ప్రక్రియను ఎడారీకరణ అంటారు. రుతుపవన వర్షపాతం దీర్ఘకాల సగటు కంటే 75% తక్కువగా ఉన్న పరిస్థితిని కరవుగా పేర్కొంటారు.
15వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం
2030 నాటికి సాధించాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 15వది ‘అడవులు, ఇతర ఆవరణ వ్యవస్థలను పరిరక్షించడం, భూక్షీణతను, జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం’. ఇది కరవు, ఎడారీకరణను అడ్డుకోవాలని సూచిస్తుంది. దీని ప్రకారం భూచర ఆవరణ వ్యవస్థలను రక్షిస్తూ, సుస్థిరంగా వినియోగిస్తూ అడవులను పరిరక్షించాలి.
గణాంకాలు
ఐక్యరాజ్యసమితి ప్రకారం, 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా మానవ ప్రేరేపిత భూక్షయం కనీసం 1.6 బిలియన్ హెక్టార్లను ప్రభావితం చేసింది. భూమిపై సగానికిపైగా పచ్చిక బయళ్లు విస్తరించగా వాటిలో 50% వరకు క్షీణించాయి. ఇదే సమయంలో తీవ్రమవుతోన్న ఎల్‌నినో పరిస్థితులు దక్షిణాసియా అంతటా తీవ్రమైన కరవు ప్రమాదాలను పెంచుతున్నాయి.
యూఎన్‌సీసీడీ 2024 నివేదిక
యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ (యూఎన్‌సీసీడీ) 2024 నివేదిక గత 30 ఏళ్లుగా 77 శాతం భూమి పొడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొందని పేర్కొంది. ఈ సమయంలో భూమిపై పొడి నేలల సంఖ్య 43 లక్షల చదరపు కి.మీ. పెరిగిందని, ఇది మొత్తం భూభాగంలో 40 శాతంపైనేనని వెల్లడించింది. కర్బన ఉద్గారాల విడుదలను అడ్డుకోకపోతే 3 శాతం సాధారణ భూములు పొడిగా మారిపోతాయని నివేదిక హెచ్చరించింది.
చారిత్రక నేపథ్యం
1992లో బ్రెజిల్‌లోని రియో డి జెనిరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్‌లో స్థిర అభివృద్ధికి ఎడారీకరణ, కరవు ప్రధాన అవరోధాలుగా గుర్తించారు. దీనికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) 1994, జూన్ 17న యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ (యూఎన్‌సీసీడీ)ని నెలకొల్పింది. ఐరాస ప్రపంచవ్యాప్తంగా ఏటా అదే తేదీన ‘ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవం’గా జరుపుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది.
| యూఎన్‌సీసీడీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎన్ని దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి? ఎడారీకరణ - కరవు నివారణకు భారత్ చేపట్టిన చర్యలతోపాటు గతంలో పలు పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఎడారీకరణ కింది దేనివల్ల కలుగుతుంది?
(ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్, 2025)
1) అటవీ నిర్మూలన 2) కరవు
3) వృక్షసంపద నష్టం 4) పైవన్నీ
సమాధానం: 4
2. ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)
1) మే 22 2) జూన్ 5
3) ఏప్రిల్ 22 4) జూన్ 17
సమాధానం: 4
3. ఎడారీకరణ నివారణ కోసం పనిచేసే కన్వెన్షన్?
(ఆర్‌ఎస్‌ఎంఎస్‌ఎస్‌బీ జేఈ మెకానికల్ (డిగ్రీ), 2020)
1) యూఎన్‌డబ్ల్యూఎఫ్ 2) యునిసెఫ్
3) యూఎన్‌సీసీడీ 4) యునెస్కో
సమాధానం: 3
4. When was Drought Prone Area Programme launched?
(RSMSSB LDC Official Paper 2018)
1) 1973-74 2) 1984-85 3) 1996-97 4) 2001-2002
Ans: 1
5. Which of the following statements is/are correct?
i. India is a signatory to the United Nations Convention to Combat Desertification (UNCCD).
ii. Ministry of Home Affairs is the nodal Ministry in the Government of India for the UNCCD.
Select the correct answer using the code given below:
(CDS GK Previous Paper 2019)
1) i only 2) ii only 3) Both i and ii 4) Neither i nor ii
Ans: 1
6. Which nation hosted the 14th Conference of Parties (COP) of the United Nations Convention to Combat Desertification (UNCCD)?
(RRB NTPC CBT-I Official Paper 2021)
1) India 2) South Africa 3) China 4) UAE
Ans: 1
7. ____________ is also known as soil moisture drought. Low soil moisture results in crop failures.
(SSC JE ME Previous Paper 2017)
1) Meteorological Drought 2) Agricultural Drought
3) Hydrological Drought 4) Ecological Drought
Ans: 2