ప్రజలకు కావాల్సిన ముఖ్యమైన కనీస అవసరాల్లో ఆరోగ్యం మొదటిది. ఆరోగ్యవంతులైన ప్రజలతోనే సమాజం, దేశం అభివృద్ధి సాధ్యం. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆయుష్మాన్ భారత్ యోజన అనే ఆరోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద, వెనుకబడిన కుటుంబాలకు ఉచిత వైద్య చికిత్స అందించాలని సంకల్పించింది. ఎంతో మంది ప్రజలకు ఆసరాగా నిలిచిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం విజయానికి గుర్తుగా ఏటా మన దేశంలో ఏప్రిల్ 30న ‘ఆయుష్మాన్ భారత్ దివస్’ను నిర్వహిస్తారు. దేశ ప్రజలందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు అందించడంతోపాటు ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించడం, మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్య సదుపాయాలు అందించడం ఈ రోజు లక్ష్యం. ఈ రోజు ముఖ్యంగా ‘ఆయుష్మాన్ భారత్ - ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ - పీఎంజేఏవై)’ పథకం, దాని లక్ష్యాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తారు.
ఆయుష్మాన్ భారత్ యోజన
1. హెల్త్ కేర్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ (హెచ్‌డబ్ల్యూసీలు):
2. ఆయుష్మాన్ భారత్ - ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ - పీఎంజేఏవై)
3. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం):
చారిత్రక నేపథ్యం:
ప్రధాని మోదీ 2018, సెప్టెంబరు 23న ఏబీ - పీఎంజేఏవై పథకాన్ని ఝార్ఖండ్‌లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్లకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరేలా చేపట్టిన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య హామీ పథకంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం, పశ్చిమ్ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది అమల్లో ఉంది. ఏబీ - పీఎంజేఏవై, ఏబీ-హెచ్‌డబ్ల్యూసీ లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏప్రిల్ 30న ‘ఆయుష్మాన్ భారత్ దివస్’గా జరుపుకోవాలని 2019లో తీర్మానించింది.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఆయుష్మాన్ భారత్ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పీజీటీ జాగ్రఫీ, 2021)
1) ఏప్రిల్ 30 2) మార్చి 26
3) ఏప్రిల్ 9 4) ఏప్రిల్ 21
సమాధానం: 1
2. ఆయుష్మాన్ భారత్ కింది దేనికి సంబంధించింది?
(ఎస్‌ఎస్‌ఎస్‌సీ సీఆర్‌ఈ (ఆర్‌ఐ, ఏఆర్‌ఐ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్), 2025)
1) సార్వత్రిక ఆరోగ్య కవరేజీ 2) అందరికీ గృహవసతి
3) పెన్షన్ ప్రయోజనాలు 4) ఉచిత విద్య
సమాధానం: 1
3. ఆయుష్మాన్ భారత్ - ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ - పీఎంజేఏవై) ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
(ఎస్‌ఎస్‌సీ జీడీ, 2021)
1) 2018 2) 2014
3) 2019 4) 2015
సమాధానం: 1
4. Ayushman Bharat - National Health Protection Mission has coverage of____________.
(NCL Assistant Foreman Trainee 2024)
1) 3 lakh for each family 2) 5 lakh for each family
3) 1 lakh for each family 4) 4 lakh for each family
Ans: 2
5. The Ayushman Bharat Scheme was started in _________ in the year 2018.
(NTPC CBT-I 2021)
1) Jharkhand 2) Chandigarh 3) Orissa 4) Madhya Pradesh
Ans: 1