ఒక వ్యక్తిలోని మానసిక సృజనాత్మకతను మేధో సంపత్తిగా పేర్కొంటారు. శాస్త్ర-సాంకేతిక ఆవిష్కరణలు, సాహిత్య - కళాత్మక రచనలు, వాణిజ్యపరమైన డిజైన్లు - చిహ్నాలు - పేర్లు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి. పరిశోధకులు తాము కనిపెట్టిన లేదా సృష్టించిన వాటి నుంచి గుర్తింపు లేదా ఆర్థిక ప్రోత్సాహం పొందాలంటే పేటెంట్, ట్రేడ్‌మార్క్ లేదా కాపీరైట్ చేసుకోవాలి. వీటినే మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్) అంటారు. ప్రజల్లో సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్ 26న ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని (World Intellectual Property Day) నిర్వహిస్తారు. పేటెంట్లు, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, డిజైన్లపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అవి రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్) అంటే?
1. పేటెంట్
2. ట్రేడ్‌మార్క్స్
3. డిజైన్స్
4. కాపీరైట్స్
5. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ)
6. సెమీకండక్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేఅవుట్ డిజైన్
7. ట్రేడ్ సీక్రెట్
8. ప్లాంట్ వెరైటీస్
| ప్రపంచ మేధో సంపత్తి సంస్థ, పేటెంట్ దరఖాస్తుల్లో భారత్ పురోగతి, చారిత్రక నేపథ్యంతోపాటు ఈ అంశంపై గతంలో వివిధ పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ ‘జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’లో అందుబాటులో ఉంది. వివరాల కోసం వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి .https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు..
1. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ)ను ఏ సంవత్సరంలో స్థాపించారు?(కేవీఎస్ లైబ్రేరియన్, 2023)
1) 1951 2) 1963 3) 1967 4) 1975
సమాధానం: 3
2. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?(ఓఎస్‌ఎస్‌సీ బీఎస్‌ఎస్‌ఓ, 2022)
1) మెల్‌బోర్న్ 2) టోక్యో
3) న్యూయార్క్ 4) జెనీవా
సమాధానం: 4
3. The World Intellectual Property Organization released the 17th edition of the Global Innovation Index 2024, ranking 133 economies based on innovation capabilities across 80 indicators grouped into seven pillars. India demonstrated steady improvement while Switzerland maintained dominance. What position did India secure in the GII 2024 with a score of 38.3?(SBI PO Mains 2025)
1. 37th 2. 35th 3. 39th 4. 41st 5. 43rd
Answer: 3
4. Arrange the following IPR-related international treaties in the order of their adoption.
A. Berne Convention
B. TRIPS Agreement
C. Paris Convention
D. WIPO Copyright Treaty
E. Patent Cooperation Treaty
Choose the most appropriate answer from the options given below:
(UGC-NET 2025)
1. A, C, E, B, D 2. C, A, E, B, D
3. A, B, C, D, E 4. C, A, E, D, B
Answer: 2
5. According to the World Intellectual Property Indicators (WIPI) 2024 report, what is India's rank globally in terms of patents with 64,480 applications?(RPF Constable 2025)
1. Ninth 2. Fourth 3. Second 4. Sixth
Answer: 4