వరల్డ్‌ మలేరియా డే 

వరల్డ్‌ మలేరియా డే 

మలేరియా అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు దీని వల్ల ప్రభావితమవుతున్నారు. నివారణ, చికిత్స పద్ధతులు ఉన్నా నేటికీ మలేరియా ఒక ప్రధాన ప్రజారోగ్య సవాలుగా కొనసాగుతోంది. దీనివల్ల సంభవించే మరణాల రేటులో గణనీయంగా తగ్గుదల నమోదవుతున్నా వ్యాధి రాకుండా అరికట్టడంలో మాత్రం ప్రపంచ దేశాలు విఫలమవుతూనే ఉన్నాయి. మలేరియా ప్రభావం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్‌ 25న ‘వరల్డ్‌ మలేరియా డే’గా నిర్వహిస్తారు. ఈ వ్యాధి లక్షణాలు, సమర్థవంతమైన నివారణ, సకాలంలో చికిత్స లాంటి విషయాలపై ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

మలేరియా - సంక్రమణ

  • ఈ వ్యాధి ప్రోటోజోవాకు చెందిన ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ జీవి రెండు ఆతిథేయిల్లో తన జీవిత చక్రాన్ని పూర్తిచేసుకుంటుంది. అవి: దోమ, మానవుడు. వీటిలో ఆడ ఎనాఫిలస్‌ దోమ ప్రధాన ఆతిథేయి. మానవుడు ద్వితీయ లేదా మాధ్యమిక ఆతిథేయి.
  • ప్లాస్మోడియం ఆతిథేయి ఎర్రరక్త కణాలు, కాలేయంలో తన జీవిత చక్రాన్ని పూర్తిచేసుకుని, సంఖ్యను పెంచుకుని వ్యాధిని కలిగిస్తుంది. దోమ కాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. 

వ్యాప్తి ఇలా..

  1. మలేరియా జ్వరానికి మూలమైన ‘ప్లాస్మోడియం’ ఆడ ఎనాఫిలస్‌ దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.  
  2. అప్పటికే మలేరియాతో బాధపడుతున్న వ్యక్తిని దోమ కుడితే దానికీ పరాన్నజీవి సోకుతుంది. ఆ దోమ మరొకరిని కుట్టినప్పుడు లాలాజలం ద్వారా వ్యక్తి రక్తంలోకి పరాన్నజీవి ప్రవేశిస్తుంది. ఇది కాలేయంలోకి చేరుకుని పరిపక్వమై, వృద్ధి చెందుతుంది. కాలేయ కణాలను ఇన్ఫెక్షన్‌కి గురిచేస్తుంది. ఆ కణాలు విచ్ఛిన్నం కావడంతో పరాన్నజీవులు రక్తంలోకి, తర్వాత ఎర్ర రక్తకణాల్లోకి చేరి, ఇన్ఫెక్షన్‌ కలిగిస్తాయి.
  3. ఇలాంటి వ్యక్తులను దోమలు కుట్టడం, అవి మరొకరిని కుట్టడం.. వారిలో ఇన్ఫెక్షన్‌ కలిగించడం... ఇలా ఒక చట్రంలా కొనసాగుతూ వస్తుంటుంది.
  4. మలేరియా వ్యాధి ప్రారంభంలో చలి, జ్వరం వస్తాయి. జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో రోగికి తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటాయి. దీని తర్వాత దశలో రోగికి అధికంగా చెమటలు వచ్చి జ్వరం తగ్గుతుంది. ఈ లక్షణాలు మళ్లీ, మళ్లీ కనిపిస్తాయి.
  5. మలేరియా జ్వరానికి చాలాకాలం వరకు క్వినైన్‌ అనే ఔషధంతో చికిత్స చేసేవారు. ప్రస్తుతం ఈ వ్యాధికి క్లోరోక్విన్, ప్రిమాక్విన్‌ అనే ఔషధాలను వాడుతున్నారు. మన చుట్టుపక్కల ప్రదేశాల్లో దోమలు అభివృద్ధి చెందకుండా చూడటం, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.

చారిత్రక నేపథ్యం:

ఆఫ్రికన్‌ దేశాల్లో మలేరియా బెడద ఎక్కువ. ఈ వ్యాధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు 2001 నుంచి అక్కడి ప్రభుత్వాలు ఏప్రిల్‌ 25న ‘ఆఫ్రికా మలేరియా డే’ నిర్వహించేవి. ప్రపంచవ్యాప్తంగా మలేరియాను నియంత్రించాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌ఓ 2007, మేలో జరిగిన 60వ అసెంబ్లీలో ఏప్రిల్‌ 25న ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్‌ మలేరియా డే’గా జరుపుకోవాలని తీర్మానించింది. 2008 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ‘వరల్డ్‌ మలేరియా డే’ను ఏ రోజున నిర్వహిస్తారు?

(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ ప్రహారి, 2023),(ఐసీఏఆర్‌ అసిస్టెంట్, 2022)

1) ఏప్రిల్‌ 20   2) ఏప్రిల్‌ 25  3) ఏప్రిల్‌ 30   4) మే 2

సమాధానం: 2

2. 2019, మేలో కింది వేటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మలేరియా రహిత దేశాలుగా గుర్తించింది?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2020)

1) బెల్జియం, ఖతార్‌    2) భారత్, సింగపూర్‌

3) మారిషస్, మలేసియా 4) అర్జెంటీనా, అల్జీరియా        

సమాధానం: 4

3. Which of the following countries recorded the largest reduction in malaria cases in South-East Asia as per the 'World Malaria Report 2020' released by the World Health Organization?
(SSC GD 2021)
1) India        2) China        3) Bangladesh        4) Pakistan
Ans: 1
4. According to the latest World Malaria Report published by WHO in November-2018, how many countries accounted for nearly half of all malaria cases worldwide?
(MP HSTET 2019)
1) Fifteen        2) Three        3) Five        4) Nine
Ans: 3
5. Which nation of South America has recently got 'Malaria-free Nation' certificate from World Health Organisation - 2018?
(Karnataka Police Constable 2018)
1) Perugue        2) Algeria        3) Uzbekistan        4) India
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram