6వ ఆర్థిక గణన నివేదిక

6వ ఆర్థిక గణన నివేదిక
  • దేశంలో వ్యవసాయం, వ్యవసాయేతర రంగాల్లో పనిచేసే వ్యాపార సంస్థలు 5.85 కోట్లు ఉన్నట్లు కేంద్ర గణాంకాల శాఖ 2026, జూన్‌ 19న విడుదల చేసిన 6వ ఆర్థిక గణన పూర్తిస్థాయి నివేదికలో వెల్లడించింది. 2013 జనవరి నుంచి 2014 ఏప్రిల్‌ వరకు సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ లెక్కలను వెల్లడిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థల్లో 59.48% సంస్థలు గ్రామాల్లో, మిగిలినవి పట్టణాల్లో పనిచేస్తున్నాయి. వీటిలో 13.12 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. 
  • వ్యవసాయరంగంలో పనిచేసే సంస్థలు 2.28 కోట్లమందికి, వ్యవసాయేతర రంగాల్లో పనిచేసే సంస్థలు 10.84 కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. మొత్తం సంస్థల్లో 73.70% హిందువులు, 13.8% ముస్లింలు, 2.60% క్రైస్తవులు, మిగిలిన 9.90% ఇతర మతాలవారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram