మహిళా రిజర్వేషను బిల్లు- 2023 అమలులో ఉన్నప్పటికీ దేశ రాజకీయాల్లో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది. లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి 10 మంది అభ్యర్థుల్లో ఒక్కరు మాత్రమే మహిళలు ఉంటున్నారని తెలిపింది.
ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో పలు రాజకీయపార్టీలు మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించారనే దానిపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 2023 సెప్టెంబరు నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో పోటీచేసిన మొత్తం 51,708మంది అభ్యర్థుల్లో కేవలం 5,095 (10 శాతం) మాత్రమే మహిళలు పోటీ చేసినట్లు తెలిపింది.