విశ్వవిద్యాలయాల్లో వివిధ అంశాల బోధన తీరుతెన్నులపై సర్వే నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉన్నతవిద్య నెట్‌వర్క్ సంస్థ క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) భారత్ సహా విదేశీ విద్యాలయాల ర్యాంకులను 2026, జూన్ 18న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1,500లకుపైగా విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్ కేటాయించింది.
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027 జాబితాలో భారత్‌కి చెందిన 52 విశ్వవిద్యాలయాలకు చోటు లభించింది. దీంతో అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ తర్వాత ప్రపంచంలో అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థగా భారతదేశం నిలిచింది. ర్యాంకింగ్స్‌లో ఐఐటీ దిల్లీ.. 118వ ర్యాంకు సాధించి, అత్యున్నత స్థానం పొందిన భారతీయ విద్యాసంస్థగా నిలిచింది.