కాగ్‌ నివేదిక

కాగ్‌ నివేదిక
  • గడచిన దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల సరాసరి ఖర్చులు 131 శాతం మేర పెరిగాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) 2026, జూన్‌ 16న విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 22.18 లక్షల కోట్లుగా ఉన్న ఈ వ్యయం, 2024-25 సంవత్సరం కల్లా రూ. 51.20 లక్షల కోట్లకు పెరిగిందని తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి నిలిపిన కారణంగా ఇది సంభవించిందని కాగ్‌ పేర్కొంది.
  • రాష్ట్రాల బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయానికి పెద్దపీట వేశారని మొత్తం వ్యయంలో ఇది సరాసరిన 83 శాతంగా నిలిచిందని నివేదిక తెలిపింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram