‘భారతదేశంలో మహిళలు, పురుషులు-2025’ నివేదిక

‘భారతదేశంలో మహిళలు, పురుషులు-2025’ నివేదిక
  • రాష్ట్రంలో అధిక బరువు (ఒబెసిటీ) సమస్య పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా వేధిస్తోంది. సాధారణ స్థితి కంటే తక్కువ బరువున్న (బీఎంఐ 18.5 కంటే తక్కువ) మహిళల సంఖ్య గతంలో కంటే తగ్గినా, ఊబకాయ సమస్య ఎక్కువమందిని వెంటాడుతోంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘భారతదేశంలో మహిళలు, పురుషులు-2025’ నివేదిక ఈ విషయాల్ని స్పష్టం చేసింది.
  • ఆ నివేదిక ప్రకారం.. 2015-16లో పురుషుల్లో ఒబెసిటీ 7.7% ఉంటే.. 2019-21 నాటికి 6.3%కి తగ్గింది. ఇదేకాలంలో మహిళల్లో 10.3% నుంచి 12%కి పెరిగింది. నేషనల్‌ ఫ్యామిలీహెల్త్‌ సర్వే-4 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-4)లో 17.6% మంది మహిళలు సాధారణం కంటే తక్కువ బరువు ఉన్నట్లు గుర్తిస్తే.. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5లో ఆ సమస్య 14.8%కి తగ్గింది. అధిక బరువున్న మహిళలు గతంలో 33.2% ఉంటే.. ఇప్పుడు 36.3%కి పెరిగినట్లు గుర్తించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram