కేంద్ర పంచాయత్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఇండెక్స్‌ 2023-24 నివేదిక

కేంద్ర పంచాయత్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఇండెక్స్‌ 2023-24 నివేదిక
  • పంచాయతీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై 2023-24 సంవత్సరానికి పంచాయత్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఇండెక్స్‌ (పీఏఐ) 2.0 నివేదికను కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ 2026, ఏప్రిల్‌ 29న విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన 591 పంచాయతీలు మాత్రమే ‘ఏ’ గ్రేడ్‌ సాధించాయి. రాష్ట్రంలోని మొత్తం 13,310 పంచాయతీల సమాచారాన్ని పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాటిలో 4.40% మాత్రమే ఏ-గ్రేడ్‌కు ఎంపికయ్యాయి. బీ-గ్రేడ్‌లో 10,178, సీ-గ్రేడ్‌లో 2,468, డీ-గ్రేడ్‌లో 73 పంచాయతీలు నిలిచాయి. 
  • గ్రేడ్ల కేటాయింపునకు పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు, పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, బాలల సంక్షేమం, నీటి వనరులు, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, శ్మశానాల నిర్వహణ తదితర అంశాల్లో మొత్తం 516 కొలమానాలు, 7,945 డేటా పాయింట్ల ఆధారంగా ఈ ఫలితాలు వెల్లడించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram