మార్కెట్ విలువపరంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 100 బిలియన్ డాలర్ల (రూ.8.8 లక్షల కోట్ల) క్లబ్బులోకి చేరింది. ఈ ఘనత సాధించిన ఆరో భారతీయ కంపెనీగా, ప్రభుత్వ రంగం నుంచి తొలి సంస్థగా నిలిచింది. 2025, నవంబరు 6న బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 1.47% పెరిగి జీవనకాల గరిష్ఠమైన రూ.971.15ను చేరింది. తద్వారా బ్యాంక్ మార్కెట్ విలువ రూ.8.96 లక్షల కోట్లకు (100 బి.డాలర్లకు పైగా) చేరింది.