దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మొత్తం వ్యాపారం రూ.100 లక్షల కోట్ల మైలురాయికి చేరింది. ఆస్తుల పరంగా ప్రపంచంలో 43వ అతిపెద్ద బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలిచింది. ఈ విషయాన్ని బ్యాంక్ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి 2025, నవంబరు 4న వెల్లడించారు. సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తూ, ఆయన ఈ వివరాలు తెలిపారు.