మనదేశానికి 1.5 బి. డాలర్ల (సుమారు రూ.14,250 కోట్ల) రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను సృష్టించడం, ఆర్థిక వృద్ధిలో వేగం పెంచడం కోసం చేపట్టిన భారత నిర్మాణాత్మక సంస్కరణలకు మద్దతుగా ఈ ఆర్థిక సహాయాన్ని చేస్తోంది.
వచ్చే రెండు దశాబ్దాల్లో 1.1 కోట్ల మంది యువ భారతీయులకు ఉద్యోగావకాశాలు సృష్టించే ప్రైవేటు రంగ డెవలప్‌మెంట్ పాలసీ ఫైనాన్సింగ్ (డీపీఎఫ్) ఆపరేషన్ నిమిత్తం ఈ రుణం అందజేస్తారు.