‘భారత్-బ్రిటన్ సమగ్ర, ఆర్థిక వాణిజ్య ఒప్పందం’ 2026, జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ఇరువురు నేతలు ఆ సందర్భంగా విడిగా చర్చించుకున్న మీదట ఈ ప్రకటన చేశారు. దాదాపు ఏడాది క్రితమే ఈ ఒప్పందం కుదిరింది.