అంతరిక్ష రంగంలోని హైదరాబాద్ సంస్థ ధ్రువ స్పేస్, ఫిన్‌లాండ్ సంస్థ ఐస్‌ఐతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉపగ్రహాల తయారీ, స్పేస్ సిస్టమ్స్ ఉత్పత్తి, భూ పరిశీలన సేవలు, విపత్తు నిర్వహణ పరిష్కారాలు, గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ రెండు సంస్థలూ కలిసి పనిచేయనున్నాయి. ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ 2026 సదస్సులో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ధ్రువ స్పేస్ వెల్లడించింది.
దేశీయ, అంతర్జాతీయ కార్యక్రమాల కోసం శాటిలైట్ బస్సులు, ఇతర స్పేస్ సిస్టమ్‌లను ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి.