జియో ప్లాట్‌ఫామ్స్‌ అంతర్జాతీయ రికార్డు

జియో ప్లాట్‌ఫామ్స్‌ అంతర్జాతీయ రికార్డు
  • వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ (వైపో) విడుదల చేసిన తాజా పేటెంట్‌ కో-ఆపరేషన్‌ ట్రీటీ (పీసీటీ) ర్యాంకింగ్స్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెక్నాలజీ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ గ్లోబల్‌ టాప్‌-20లో చోటు దక్కించుకుంది. 2025 సంవత్సరానికి విడుదల చేసిన జాబితాలో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఏకంగా 320 స్థానాలు పైకి వచ్చి, 20వ స్థానంలో నిలిచింది. తద్వారా అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆవిష్కరణల సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
  • హువావే, శామ్‌సంగ్, క్వాల్‌కామ్, ఎల్‌జీ, పానాసోనిక్, నోకియా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ అగ్రగామి టెక్నాలజీ సంస్థల సరసన నిలిచింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram