భారత్‌-న్యూజిలాండ్‌ ఎఫ్‌టీఏ

భారత్‌-న్యూజిలాండ్‌ ఎఫ్‌టీఏ
  • భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. దిల్లీలో 2026, ఏప్రిల్‌ 27న జరిగిన కార్యక్రమంలో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, న్యూజిలాండ్‌ వాణిజ్య పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్‌ మెక్‌క్లే ఎఫ్‌టీఏపై సంతకాలు చేశారు. ఈ ఏడాది చివరకు ఇది అమల్లోకి వస్తుంది.
  • అప్పుడు మన ఎగుమతులపై న్యూజిలాండ్‌లో సుంకమే ఉండదు. ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్యం అయిదేళ్లలో రెట్టింపై 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.47,000 కోట్ల)కు చేరుతుందని అంచనా. 20 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.88 లక్షల కోట్ల) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ మనదేశంలోకి వస్తాయి. ఎఫ్‌టీఏ చర్చలు 2010లో ప్రారంభమైనా, అనివార్య కారణాలతో 2015లో ఆగిపోయాయి. మళ్లీ 2025, మార్చిలో రెండు దేశాలూ చర్చలు ప్రారంభించి, 9 నెలల్లోనే సానుకూలంగా ముగించాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram