ఆర్చరీ ప్రపంచకప్‌

ఆర్చరీ ప్రపంచకప్‌
  • ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్‌లో ధీరజ్‌ బొమ్మదేవర రెండు స్వర్ణాలు నెగ్గాడు. ప్రపంచకప్‌ ఒకే అంచెలో వ్యక్తిగత, మిక్స్‌డ్‌ విభాగాల్లో పసిడి చేజిక్కించుకున్న తొలి భారత పురుష ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు. అంటాల్యాలో జరుగుతున్న ప్రపంచకప్‌ స్టేజ్‌-3లో 2026, జూన్‌ 14న రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలోనే కాక మిక్స్‌డ్‌ ఈవెంట్లోనూ ధీరజ్‌ పసిడి పతకం అందుకున్నాడు. వ్యక్తిగత ఫైనల్లో 7-3 (30-29, 29-28, 27-27, 29-27, 30-29)తో పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన లీ వూ సియోక్‌ (దక్షిణ కొరియా)ను ఓడించాడు. 
  • రికర్వ్‌ మిక్స్‌డ్‌ జట్టు విభాగంలో కుంకుమ్‌ మొహోద్‌తో కలిసి ధీరజ్‌ స్వర్ణం నెగ్గాడు. ఫైనల్లో ఈ ద్వయం 5-1 (37-36, 37-36, 39-39)తో కిమ్‌ జె-డెక్, ఓ యె-జిన్‌ (కొరియా) ఒలింపిక్‌ ఛాంపియన్‌ జంటను ఓడించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram