ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

కైరో (ఈజిప్ట్‌)లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ను భారత్‌ అగ్రస్థానంతో ముగించింది. టోర్నీ ఆఖరి రోజైన 2026, ఏప్రిల్‌ 26న రెండు పతకాలు గెలిచింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో హేమంత్‌ బర్మన్‌ రజతం సాధించాడు. అతడు ఈ ఈవెంట్లో మొత్తం 351.7 స్కోరు చేశాడు. మిక్స్‌డ్‌ ట్రాప్‌ పోటీలో జుహైర్, ఆద్య జోడీ 19 స్కోరుతో కాంస్యం నెగ్గింది. టోర్నీలో 16 పతకాలతో (5 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) భారత్‌.. అగ్రస్థానంలో నిలిచింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram