డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ విక్టర్ అక్సెల్సెన్ 2026, ఏప్రిల్ 15న ఆటకు వీడ్కోలు పలికాడు. గాయాల కారణంగా శరీరం సహకరించకపోవడంతో ఈ నిర్ణయం అనివార్యమైందని విక్టర్ తెలిపాడు. వెన్నుకు శస్త్రచికిత్స జరగడంతో అతడు 2025, అక్టోబరు నుంచి కోర్టులో అడుగు పెట్టలేదు. అతడు చివరగా 2025 అక్టోబరులో డెన్మార్క్ ఓపెన్‌లో తలపడ్డాడు. తన 16 ఏళ్ల కెరీర్ ఆసాంతం ఆస్తమాతో ఇబ్బంది పడుతూనే ఆటలో కొనసాగాడు విక్టర్.
ప్రపంచ నంబర్‌వన్‌గా 183 వారాలు కొనసాగాడు అక్సెల్సెన్. ఇది మూడో అత్యధికం కావడం విశేషం.