క్యాండిడేట్స్ చెస్ టోర్నీ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా వైశాలి రికార్డు నెలకొల్పింది. 2026, ఏప్రిల్ 15న పాఫోస్ (సైప్రస్)లో జరిగిన ఆఖరిదైన 14వ రౌండ్లో తమిళనాడుకు చెందిన వైశాలి.. కేథరినా లాగ్నో (రష్యా)తో గేమ్‌లో అద్భుత విజయాన్నందుకుని టైటిల్ సాధించింది. 8.5 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది.
భారత్ నుంచి క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన మూడో ప్లేయర్ వైశాలి. ఓపెన్ విభాగంలో ఇంతకుముందు విశ్వనాథన్ ఆనంద్ (2014), దొమ్మరాజు గుకేశ్ (2024) టైటిల్ నెగ్గారు.