కేంద్ర ప్రభుత్వం జన్ విశ్వాస్ చట్టం-2026 కింద ఆరోగ్య రంగంలో కీలక సంస్కరణలను అమలులోకి తెచ్చింది. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే నేరాలకు కఠినమైన శిక్షలను అలాగే కొనసాగించింది. ఔషధాలు, సౌందర్య ఉపకరణాల చట్టం-1940, ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006 కింద పలు చిన్న, సాంకేతిక ఉల్లంఘనలను నేరరహితంగా మార్చింది. ఈ సంస్కరణలు సాంకేతిక లేదా విధానపరమైన లోపాలకు, తీవ్రమైన ప్రజారోగ్య నేరాలకు మధ్య వ్యత్యాసాన్ని చూపడానికి ప్రయత్నిస్తాయని వివరించింది.
సవరించిన నిబంధనల ప్రకారం... గతంలో క్రిమినల్ చర్యలకు దారితీసిన కొన్ని సాంకేతిక, విధానపరమైన ఉల్లంఘనలను ఇప్పుడు పరిపాలనాపరమైన జరిమానాలుగా పరిగణించి, తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు.