మద్రాస్‌ ఐఐటీలో పరిశోధన కేంద్రం

మద్రాస్‌ ఐఐటీలో పరిశోధన కేంద్రం

దేశంలోనే తొలిసారిగా ప్లాంట్ సెల్‌ ఫెర్మెంటేషన్‌(పీసీఎఫ్‌) టెక్నాలజీపై పరిశోధనల కోసం సరికొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఐఐటీ మద్రాస్‌(ఐఐటీఎం), హెర్బాలైఫ్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్త సహకారంతో జూన్‌ 22న ప్రారంభమైంది. ఈ సాంకేతికత ద్వారా మొక్కల కణాలను ప్రయోగశాలల్లో పెంచి క్యాన్సర్‌ వంటి వ్యాధులకు ఔషధాలు తయారు చేస్తారు. సౌందర్య సాధనాలు, ఆరోగ్యానికి మేలుచేసే ఫైటోకెమికల్స్, సుగంధ ద్రవ్యాలు, సువాసనలు వెదజల్లే పదార్థాలను ఉత్పత్తి చేయనున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram