మహిళల భద్రత, లింగ సమానత్వం, గ్రామీణ స్థాయి నాయకత్వం లాంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న 17.5 లక్షలమంది పురుష ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ తొలిసారిగా ‘నిర్భయ చేతన’ అనే జాతీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా దిల్లీలో జూన్ 17 నుంచి 19 వరకు మూడ్రోజులపాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది.